నిజాంసాగర్ నుంచి నీటి విడుదల ప్రారంభం
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు శుక్రవారం ఐదో విడత నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో నీటిని అందించారు. ఐదో విడతలో రోజూ వెయ్యి క్యూసెక్కుల చొప్పు న నీటిని అందించనున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,396.92 అడుగుల (8.351 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టునుంచి నీటి ని విడుదల చేస్తున్నందున ప్రధాన కాలువ లోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు కోరా రు. నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. ఆయకట్టు కింద సాగు చేసిన ప్రతి గుంటకు సాగు నీరు అందించి పంటలను గట్టెక్కిస్తామని పేర్కొన్నారు.
నేడు శ్రీసిద్దరామేశ్వరాలయ
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరులోని శ్రీసిద్దరామేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ విషయాన్ని ఆలయ ఈవో శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం వేకువజామున గణపతి పూజ, అంకురార్ప ణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ ని పేర్కొన్నారు. అఖండ దీపారాధన, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన, శ్రీసిద్దగిరి సమాధి వద్దకు ఊరేగింపు ఉంటాయని తెలిపారు. ఆదివారం ప్రత్యేక పూజలతోపాటు ఎడ్ల బండ్లతో ఆలయ ప్రదక్షిణ, అర్ధరాత్రి వీరభధ్ర ప్రస్తావన, సోమవా రం శ్రీసిద్ధగిరి సమాధి వద్ద పూజ, స్వామి వారి కల్యాణం, స్వామివారి విమాన రథోత్సవం, మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలు, బుధవారం శ్రీసిద్దగిరి సమాధి వర కు పల్లకీ సేవ, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు ఉత్సవా లలో పాల్గొనాలని కోరారు.
సేవాలాల్ జయంతిని
అధికారికంగా నిర్వహించాలి
లింగంపేట: సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని బంజారా సేవా సంఘ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన గిరిజన నాయకులు శుక్రవారం లింగంపేటలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ ఫిబ్రవరి 15న జన్మించారన్నారు. ఆయన 286వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు. లింగంపేట మండల కేంద్రంలోని జీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఈనెల 18న సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బంజారా సేవా సంఘ్ జిల్లా ఇన్‌చార్జి సురేందర్, మండల అధ్యక్షుడు గన్నూనాయక్, ప్రతినిధులు ప్రకాష్, లింబేష్, సర్దార్, పరశురాం, వినోద్, దశరథ్, పూల్‌సింగ్, మోతీరాం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ నుంచి నీటి విడుదల ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment