తూకంలో మోసం.. నాణ్యత ప్రశ్నార్థకం!
కామారెడ్డి అర్బన్: నాణ్యమైన వస్తువులు, సేవలను పొందడం వినియోగదారుల హక్కు. కానీ అంతటా నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తూకాల్లో మోసాలుంటున్నాయి. కాదేదీ కల్తీకి, మోసానికి అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే వినియోగదారులు మేల్కొవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలలో వినియోగదారులు ఎంత చైతన్యంగా ఉన్నా ఉత్పత్తిదారులు జిమ్మిక్కులు చేస్తూ మోసం చేస్తూనే ఉన్నారు. వినియోగదారులు, వ్యాపారుల హక్కులపై చైతన్యం చేసే యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదు. తూనికలు, కొలతలకు వేరుగా.. నాణ్యత ప్రమాణాలకు వేరుగా శాఖలు ఉండడం ఉత్పత్తిదారులకు అనుకూలంగా ఉంది. తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్యాకింగ్‌పై పేర్కొన్న వివరాలను పరిశీలించడం మినహా ఇతర విషయాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అలాగే ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు శాంపిళ్లను తీసుకుని నాణ్యతను నిర్ధారించడానికి ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖకు జిల్లాలో అధికారి లేకపోవడంతో గమనార్హం. పండ్లు, కూరగాయలు, మాంసం, అంగళ్లలో అమ్మే వస్తువులతో నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. వినియోగదారుల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
ప్రశ్నించేవారూ కరువే..
వినియోగదారులకు తమ హక్కులతో పాటు మోసాలు, వాటి నివారణ తదితర అంశాలపైనా సరైన అవగాహన లేదు. మోసాన్ని గుర్తించినా ప్రశ్నించేవారు తక్కువగానే ఉంటున్నారు. అలాగే మోసపోయామని తెలిసినప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మోసాలు జరిగినప్పుడు ఏ చర్యలు తీసుకోవాలన్న అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
పట్టించుకోని అధికారులు..
స్పందించని వినియోగదారులు
నేడు ప్రపంచ వినియోగదారుల
హక్కుల దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment