సర్కారు బడిలో ‘కృత్రిమ మేధ’
నిజాంసాగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీనికి కృత్రిమ మేధ సాయం తీసుకోవాలని నిర్ణయించిన సర్కారు.. మండలానికో పాఠశాలను ఎంపిక చేసింది. శనివారం ఏఐ సాయంతో విద్యాబోధనకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 3, 4, 5 తరగతులలో వెనకబడిన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయం తీసుకుంటోంది. మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి ఏఐ సాయంతో పాఠాలను బోధించడానికి చర్యలు తీసుకుంటోంది. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో కృత్రిమ మేధ సాయంతో బోధనను ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొంటారు. మిగతా మండలాల్లో ఈ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృత్రిమ మేధ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.
3, 4, 5 తరగతుల
విద్యార్థులకు ఏఐతో బోధన
నేడు అచ్చంపేటలో
ప్రారంభించనున్న కలెక్టర్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment