పేదల సొంతింటి కల నెరవేరుతోంది
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదలకు సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం గుండెకల్లూర్‌లో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మొగ్గువేసి పనులు ప్రారంభించారు. అలాగే సీసీ రోడ్డు పనులు, కొత్త రేషన్ షాపును ప్రారంభించారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని నియోజక వర్గంలో ఒక్కటీ ఇవ్వలేదన్నారు. జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తానన్నారు. దశల వారిగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఠల్‌రెడ్డి, రాజు పటేల్, దడ్గి నాగ్‌నాథ్, పార్టీ అధ్యక్షుడు గంగాధర్, నాగ్‌నాథ్ పటేల్, తహసీల్దార్ నరేష్ పాల్గొన్నారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం
మద్నూర్(జుక్కల్): మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రూ. 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జుక్కల్ నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, నాయకులు సాయి పటేల్, హన్మండ్లు స్వామి, ప్రజ్ఞకుమార్ తదితరులున్నారు.
సీసీ రోడ్లతో గ్రామాలకు మహర్దశ
నిజంసాగర్ (జుక్కల్): సిమెంట్ రోడ్ల నిర్మాణంతో గిరిజన తండాలు, గ్రామ పంచాయతీలు మహర్దశను సంతరించుకుంటున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం జుక్కల్ మండల కేంద్రంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం, గిరిజన తండాలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దేశాయ్, సాయా గౌడ్ తదితరులున్నారు.
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
కోసం భూమి పూజ
పేదల సొంతింటి కల నెరవేరుతోంది
Comments
Please login to add a commentAdd a comment