28 ఏళ్లకు కలుసుకున్న మిత్రులు
కామారెడ్డి రూరల్: చిన్నతనంలో కలిసి చదువుకున్న మిత్రులు 28ఏళ్ల తర్వాత కలుసుకున్న అపూర్వ ఘట్టం మండలంలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997–98 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వారంతా సహపంక్తి భోజనాలు చేశారు.
పడకల్‌లో 25 ఏళ్ల తర్వాత..
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల 1999–2000 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే అదే పాఠశాలకు చెందిన 2011–12 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు బడిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి టీచర్లు గోపాలకృష్ణ, స్వామి, జెడ్పి సింధూర, ప్రసాద్, మమతలను పూర్వ విద్యార్థులు సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment