గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన సంగ్రాం తండాకు చెందిన యువకుడు సిద్ధార్థ (19) మృతదేహం ఆదివారం లభ్యమైంది. బాన్సువాడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం సిద్ధార్థ, అన్న వరుసయ్యే రాజు ఇద్దరు కలిసి బైక్‌పై తండాకు వస్తుండగా మార్గమధ్యలో కాలువ వద్ద ఆగారు. రాజు కాలువలోకి దిగి కాళ్లుచేతులు కడుగుతుండగా నీటిలో పడిపోయాడు. రాజును రక్షించే క్రమంలో సిద్ధార్థ కాలువలో జారిపోగ స్థానికులు గమనించిన రాజును రక్షించారు. కానీ సిద్ధార్థ నీటిప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందినట్లు తండాపెద్దలు సంగ్రాం నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
● గోదావరిలో దూకుతుండగా అడ్డుకున్న పోలీసులు
నవీపేట: ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకొని కాపాడారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన బయ్యాని వంశీకృష్ణ(30) వడ్రంగి పని చేస్తూ జీవించేవాడు. ఇటీవల ఇంట్లో కుటుంబ సభ్యులతో జరిగిన ఘర్షణతో అతడు తీవ్ర మనస్థాపం చెందాడు. ఆదివారం గోదావరి నదిలో దూకి చనిపోతానని కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోను వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వారు నవీపేట పోలీసులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మండలంలోని యంచ శివారులోగల గోదావరి బ్రిడ్జిపై నడుచుకుంటూ నదిలో దూకేందుకు య త్నించిన యువకుడిని అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ చేసి అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment