సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి
మద్నూర్/బిచ్కుంద/నిజాంసాగర్/పెద్దకొడప్‌గల్(జుక్కల్): మద్నూర్ మండలం రాష్ట్ర సరిహద్దులో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మద్నూర్, నిజాంసాగర్, పెద్దకొడప్‌గల్ పోలీస్ స్టేషన్లను సోమవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లోని గదులను, సిబ్బంది క్వార్టర్లను ఎస్పీ పరిశీలించారు. ఆయా స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఆరా తీసి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. న్యాయం త్వరగా జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకోని విచారించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పేకాట, అక్రమంగా మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దకొడప్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం మండలంలోని సలాబత్‌పూర్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దును పరిశీలించారు.
చిల్డ్రన్ ప్లే పార్క్ ప్రారంభించిన ఎస్పీ
బిచ్కుంద పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ రాజేష్ చంద్ర చిల్డ్రన్ ప్లే పార్క్‌ను ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు పరిశీలించి సమస్యలు, క్రైమ్ రికార్డుల వివరాలు తెలుసుకున్నారు. సరిహద్దులో ప్రత్యేక నిఘా ఉంచాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన క
ల్పించాలని సీఐ నరేష్‌కు సూచించారు. అనంతరం పొలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ సత్యానారాయణ, బిచ్కుంద సీఐ నరేష్, రూరల్ సీఐ రాజేశ్, ఎస్సైలు మోహన్‌రెడ్డి, శివకుమార్, ఏఎస్సై సుధాకర్, పోలీసు సిబ్బంది తదితరులున్నారు.
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశం
పలు పోలీస్‌స్టేషన్ల తనిఖీ
సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి