ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

Published Thu, Mar 20 2025 2:33 AM | Last Updated on Thu, Mar 20 2025 2:32 AM

ముగిస

ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

కామారెడ్డి టౌన్‌: ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరిరోజు జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు 9,813 మంది విద్యార్థులకుగాను 9,414 మంది హాజరయ్యారు. 399 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం పర్యవేక్షించారు.

13న క్రెడా ఎన్నికలు

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ డెవలపర్స్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ (క్రెడా) ఎన్నికలను వచ్చేనెల 13న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి శేఖర్‌, సహాయకులు బట్టు రవి, పందిరి శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మాట్లాడారు. ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 13న పోలింగ్‌, అదేరోజు కౌంటింగ్‌ ఉంటాయని తెలిపారు.

చిరుధాన్యాల

వినియోగంపై అవగాహన

నాగిరెడ్డిపేట: జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోగల వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం పోచారం గ్రామంలో పర్యటించారు. గ్రామ స్తులకు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తయారు చేసుకునే తీరును వివరించారు. అనంతరం గ్రామ శివారులోని వరిపంటను పరిశీలించారు. యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీలత, మీనా, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి చైతన్య పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు

ఎంపిక

కామారెడ్డి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అండర్‌–14, 16, 18, 20 మెన్‌, ఉమెన్‌ విభాగాలలో పోటీలు జరిగాయి. 180 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 18 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ తెలిపారు. వీరు ఈనెల 23న హైదరాబాద్‌లోని కొల్లూరు గార్డియం స్పోర్టియం స్కూల్‌ మైదానంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఎంపికై ంది వీరే: జె.ఈశ్వర్‌, ఎ.పల్లవి, ఎన్‌.విజయేందర్‌, ఎం.గణేష్‌, జి.జగదీష్‌, ఎన్‌.నితిన్‌, ఎ.నక్షత్ర, కె.సునీత, డి.ప్రతాప్‌సింగ్‌, డి.పరమేశ్‌, బి.భవిత, ఎల్‌.సునీత, ఎం.రోహనా, బి.ఈశ్వరప్రసాద్‌, ఎ.పవన్‌కళ్యాణ్‌, జి.రాహుల్‌, టి.రాజేశ్‌, ఎన్‌.సిరి.

‘మానవ అక్రమ

రవాణాను అరికట్టాలి’

కామారెడ్డి రూరల్‌: మానవ అక్రమ రవాణాను అరికట్టాలని మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేశ్‌బాబు సూచించారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై జిల్లాలోని 7 మండలాల ఐకేపీ ఏపీఎంలు, సీసీలకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి మహిళలు, యువతులు ఎక్కువగా హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బారిన పడుతున్నారన్నారు. ఈ అంశంపై పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్‌ ట్రాఫికింగ్‌ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోందని, దీనిపైనా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆయా అంశాలపై చిన్న సంఘాల సమావేశంలో సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీవో మురళీకృష్ణ, ఏపీఎంలు మోయిజ్‌, రాంనారాయణగౌడ్‌, సీసీలు, టీవోటీలు రాజేందర్‌, జగదీష్‌ కుమార్‌, శ్రీనివాస్‌, అన్నపూర్ణ, గీత తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఇంటర్‌  ఫస్టియర్‌ పరీక్షలు
1
1/2

ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

ముగిసిన ఇంటర్‌  ఫస్టియర్‌ పరీక్షలు
2
2/2

ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement