అభివృద్ధి పనుల పరిశీలన
బాన్సువాడ రూరల్: మండలంలోని పులికుచ్చ తండా, చిన్న రాంపూర్ గ్రామాల్లో బుధవారం బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్ పర్యటించారు. పులికుచ్చతండా లోని పలు అభివృద్ధి పనులతోపాటు కంపోస్టుషెడ్, న ర్సరీ, ప్రకృతి వనంను ఆయన పరిశీలించారు. పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం చిన్నరాంపూర్ గ్రామంలో పర్యటించారు. పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు, సీసీ రోడ్ల పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. జీపీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అచ్చాయపల్లి, రామక్కపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులు సైతం వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. జీపీ కార్యాదర్శులుర్శి వెంకటరాములు, మల్లికార్జున్ ఉన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన