అడవిపంది దాడిలో వరి పంట ధ్వంసం
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరిదిపేట శివారులో ఉన్న బండ రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన బక్కోళ్ల రాజుకు చెందిన వరి చేనులో బుధవారం వేకువ జామున అడవి పందులు చొరబడి పంటను ధ్వంసం చేశాయి. పంటను నష్టపోవడంతో తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.
ప్రొఫెసర్ కనకయ్యకు పురస్కారం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు ఆచార్య గుండె డప్పు కనకయ్యకు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ‘ఆచార్య మడుపు కులశేఖరరావు’ పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి జరిగిన ‘ధర్మనిధి సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో ఆచార్య కనకయ్యకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సంస్థ ప్రతినిధులు, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
పన్ను చెల్లించని
సీడ్స్ కంపెనీ సీజ్
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న మారుతీ సీడ్స్ కంపెనీని కమిషనర్ రాజు ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు మున్సిపల్ మేనేజర్ హయ్యూమ్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా సీడ్స్ కంపెనీ మున్సిపల్‌కు ఆస్తిపన్ను చెల్లించడం లేదని పేర్కొన్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్ చేశామన్నారు.
హనుమాన్ మందిరంలో చోరీ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ఉత్తునూర్ గ్రామ హనుమాన్ మందిరంలో మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన తూర్పు శ్రీకాంత్(28) చోరీకి పాల్పడ్డాడు. గుడిలోని హుండిని పగులగొట్టడంతో గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు గతంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
అడవిపంది దాడిలో వరి పంట ధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment