
బడిలో చోరీకి యత్నించిన దుండగులు
కామారెడ్డి రూరల్: పాఠశాలలో చొరబడిన ముగ్గురు దొంగలు చోరీకి యత్నించగా గ్రామస్తులు వారిని వెంబడించి, ఒకరిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. టేక్రియాల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆదివారం పాఠశాల వెనకాల ఉన్న ప్రహరీ నుంచి గుర్తుతెలియని ముగ్గురు దుండగులు బడిలోకి ప్రవేశించారు. వరండాలోని ఓ సెల్ఫ్ పైన ఉన్న ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను సంచిలో వేసుకొని ఎత్తుకెళ్తుండగా స్థానికులు గమనించి వెంబడించారు. ఇద్దరు దుండగులు ప్రహరీ దూకి పారిపోగా, ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌రూం తాళాన్ని కూడా పగలగొట్టడానికి దొంగలు యత్నించినట్లు తెలిపారు.