
23 వరకు డిగ్రీ ప్రాక్టికల్స్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రాక్టికల్ / ప్రాజెక్టు పరీక్షలను ఈ నెల 16 నుంచి 23 వరకు నిర్వహించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కె సంపత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలో ప్రాక్టికల్స్/ ప్రాజెక్టు పరీక్షలు నిర్వహించి వెంటనే మార్కులను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సిందిగా కంట్రోలర్ తెలిపారు. పూర్తి వివరాలను తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
కామర్స్‌లో డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగంలో పరిశోధక విద్యార్థిని కె రంజిత పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించారు. తెయూ కామర్స్ అధ్యాపకులు, రిజిస్ట్రార్ యాదగిరి పర్యవేక్షణలో ‘అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ – ఏ స్టడీ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణస్టేట్’ అనే అంశంపై రంజిత పరిశోధన పూర్తి చేసి సి ద్ధాంత గ్రంథం మంగళవారం సమర్పించారు. రంజిత గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్ లో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొ ఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం రంజితను వీసీ యాదగిరిరావు,రిజిస్ట్రార్ యాదగిరి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కామర్స్ డీన్ రాంబాబు, అధ్యాపకులు శ్రీనివాస్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
పరిమితికి మించి
ప్రయాణం చేయొద్దు
ఖలీల్‌వాడి: ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణం చేపటొద్దని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్ ఆటో డ్రైవర్లకు సూచించారు. నగరంలోని ట్రాఫిక్ పీఎస్‌లో ఆటో డ్రైవర్లకు పలు అంశాలపై సూచనలు చేశారు. డ్రైవర్ సీటు పక్కన మరో సీటు పెట్టవద్దని, విధిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఎక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకోరాదని, నంబర్ల ప్లేట్ లేని ఆటోలను నడపరాదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఇన్‌చార్జి మంత్రిని కలిసిన సీపీ
నిజామాబాద్‌అర్బన్/ ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన సమీక్ష సమావేశానికి వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సీపీ సాయిచైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అలాగే జర్నలిస్టుల సమస్యలపై స్పందించాలని కోరు తూ టీయూడబ్ల్యూజే ఐజే యూ నాయకులు ఇన్‌చార్జి మంత్రికి వినతిపత్రం అందజేశారు.

23 వరకు డిగ్రీ ప్రాక్టికల్స్