
భూ సమస్యల పరిష్కారానికే కొత్త పోర్టల్
మాచారెడ్డి : ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని, దీనిపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పాల్వంచ, మాచారెడ్డి మండలాల రైతు వేదికల్లో భూ భారతి చట్టంపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భ కలెక్టర్ మాట్లాడుతూ.. రోజూ రెండు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకు భూముల సర్వే, పెండింగ్ సాదాబైనా మా దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపా రు. 2014 జూన్ 2కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామా ద్వారా వ్యవసాయ భూమి కొను గోలు చేసి గడిచిన పన్నెండేళ్లుగా అనుభవంలో ఉంటున్న వారికి క్రమబద్ధీకరణ చేయనున్నట్టు పేర్కొన్నారు. 2020 ఏడాదిలో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం అందిన రైతుల దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేపడతారని తెలిపారు. అర్హుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ చార్జి వసూలు చేసి సర్టిఫికెట్లు జారీ చేసి, రికార్డుల్లో నమోదైన తరువాత పట్టాపాస్ పుస్తకాలు అందజేస్తారని వెల్లడించారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చని, ఆర్డీవో ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే కలెక్టర్‌కు, కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతం ఉంటే భూమి ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూధార్ కార్డుల జారీతో రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. కామారెడ్డి ఆర్డీవో వీణ మాట్లాడుతూ.. భూ పట్టాల మార్పు లు, చేర్పుల కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాదాబైనామాలు, వారసత్వంగా వచ్చిన భూములపై ముప్పై రోజుల్లో విచారణ చేయడం జరుగుతుందన్నారు. గడువులోగా విచారణ చేయని పక్షంలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా భావించొచ్చని స్పష్టం చేశారు. రైతులు భూభారతిపై అవగాహన పెంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు హిమబిందు, శ్వేత, ప్రత్యేక అధికారులు శ్రీపతి, సురేశ్, ఎంపీడీవోలు శ్రీనివాస్, గోపిబాబు తదితరులు పాల్గొన్నారు.
రైతులు, ప్రజలకు అవగాహన
కల్పించేందుకు సదస్సులు
2014 జూన్ 2కు ముందు
సాదాబైనామాల క్రమబద్ధీకరణ
అవగాహన సదస్సులో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
డబ్బులు అడుగుతుండ్రు..
తాతల నాటి భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వెళితే డబ్బులు ఇవ్వనిదే పనులు చేయడం లేదు. ప్రభుత్వమే హక్కు పత్రాలు ఇచ్చిన భూములను రిజిస్ట్రేషన్ చేయాలని వెళితే అవమానిస్తున్నారు. చట్ట ప్రకారం ఇచ్చిన హక్కు పత్రాలు దేనికీ పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటిౖకైనా భూ భారతి చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
– అంజయ్య, రైతు, సింగరాయపల్లి

భూ సమస్యల పరిష్కారానికే కొత్త పోర్టల్