
ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల వివరాలకు సంబంధించి ట్యాబ్‌ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి సూచించారు. గోపాల్‌పేట, బంజరతండా, ధర్మారెడ్డి, తాండూర్ గ్రామాల్లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యంలో తేమశాతం, తూకం సేకరణ ప్రక్రియను వారు పరిశీలించారు. టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు లక్ష్మయ్య, శ్రీనివాస్, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్, తదితరులున్నారు.