
‘అనవసర రాద్ధాంతం చేస్తున్నారు’
కామారెడ్డి టౌన్: వక్ఫ్ బోర్డు సంస్కరణల చట్టం విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర వక్ఫ్ సుధార్ జన జాగరణ్ అభియాన్ సభ్యుడు వెంకట్‌రెడ్డి విమర్శించా రు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. ఈ చట్ట సవరణ వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. వక్ఫ్ భూముల దుర్వినియోగాన్ని అరికడుతుందన్నారు. దేశంలో వక్ఫ్ ఆస్తుల ద్వారా భారీగా ఆదాయం వస్తున్నా 3 శాతం ముస్లింలు మాత్రమే వీటిని అ నుభవిస్తున్నారని, 97 శాతం మందికి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల రాజకీయ లబ్ధికోసం అసత్య ప్ర చారం చేస్తున్నాయని, వారిని నమ్మవద్దని ప్రజలను కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీ లం చిన్నరాజులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాము, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రావు, నాయకులు కుంట లక్ష్మారెడ్డి, నేహల్, హారిక, బాలమణి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.