
30 కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: ఎండుగంజాయి తరలిస్తున్న ఐదుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని గంజ్ ప్రాంతంలో ఆటోనగర్‌కు చెందిన మొహమ్మద్ ఆయూబ్ వద్ద గంజాయి ఉన్నదనే సమాచారం మేరకు అతని వద్ద తనిఖీ చేయగా 250 గ్రాముల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొహమ్మద్ ఆయూబ్‌ను విచారించగా మహారాష్ట్ర, నాందేడ్‌లోని బోకార్‌కు చెందిన ఫరూక్‌ఖురేషీ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి నవీపేట్ మండలం యంచ వద్ద ఫారూఖ్‌ఖురేషీతోపాటు నాందేడ్‌లోని బోకార్‌కు చెందిన యషేక్ ఫయీమ్, షేక్ సిద్ధిక్, జుబేర్ పఠాన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి కారులో తనిఖీలు చేయగా అందులో 30కిలోల ఎండుగంజాయి దొరికినట్లు తెలిపారు. ఫారూక్‌ఖురేషీ ఆంధ్ర, ఛత్తీష్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి ఎండుగంజాయిని కొనుగోలు చేసి నిజామాబాద్, నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. 30.250 కిలోల ఎండు గంజాయి విలువ రూ.6లక్షల వరకు ఉంటుదన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కారు, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎ క్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ స్వప్న, ఎస్సై రాంకుమార్, సిబ్బంది హమీద్, రాజన్న, రాంబచన్, సుకన్య, ఆశన్న, అవినాష్, శ్యాంసుందర్, సాయికుమార్ పాల్గొన్నారు.