
వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి
చికిత్స పొందుతూ ఒకరు..
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా.. పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన బొట్ల సంజీవ్ (35) కామారెడ్డి గాంధీ గంజ్‌లో డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 27న సాయంత్రం అతడు బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఉగ్రవాయి వద్ద అతడి బైక్‌ను కామారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో సంజీవ్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు దేవునిపల్లి ఎస్‌ఐ రాజు తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్రంలోని ఊర చెరువులో ఓ వ్యక్తి పడిపోయి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పుట్ట నవీన్(41) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం ఊర చెరువులో అతడి మృతదేహం తేలింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో చిట్యాల మాజీ సర్పంచ్..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంబీర్ శారద(50) హైద్రాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్‌లో శారద భర్త మధుసుదన్‌రావుతో కలిసి బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శారద అక్కడిక్కడే మృతిచెందగా, మదుసుధన్ రావుకు తీవ్రగాయాలు అయ్యాయన్నారు. శారద 1993–98 వరకు చిట్యాల సర్పంచ్‌గా పనిచేసిందన్నారు. మధుసుదన్‌రావు గతంలో తాడ్వాయి ఎంపీపీగా పనిచేశాడన్నారు. శారద మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమె స్వగ్రామమైన చిట్యాలలో సోమవారం అంత్యక్రియలను జరిపించారు.
బావిలో పడి ఒకరు..
ఎడపల్లి(బోధన్): మండలంలోని మంగళ్‌పాడ్ గ్రామంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దేవదాస్ (28) ఆదివారం స్నేహితులతో కలిసి గ్రామశివారులోని పంటపొలాల్లో మద్యం సేవించడానికి వెళ్లారు. కొద్దిసేపటికి దేవదాస్ పక్కనే ఉన్న బావి వద్దకు మూత్ర విసర్జనకు వెళ్లగా ప్రమాదవవాత్తు బావిలో పడి ఈత రాక చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు
అశోక్ సాగర్‌లో పడి వృద్ధురాలు..
ఎడపల్లి(బోధన్): మండలంలోని జానకంపేట గ్రామ శివారులోగల అశోక్‌సాగర్‌లో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామనికి చెందిన బోదాసు దేవమ్మ (60) ఆదివారం సాయంత్రం గ్రామ శివారు కాలకృత్యాలకని వెళ్లి, ప్రమాదవశాత్తు అశోక్ సాగర్‌లో పడి మృతి చెందింది. మృతదేహాన్ని సోమవారం ఎడపల్లి పోలీసులు బయటకు తీసి, బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు.
ఖలీల్‌వాడి: నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ సమీపంలోగల గ్లామర్ హోటల్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం తెలిపారు. హోటల్ ఎదుట అతడు అపస్మారక స్థితిలో ఉండగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడిని వైద్యులు పరిశీలించగా మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, సుమారు 40నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మృతుడు బ్లూ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. ఎవరికై నా తెలిసినచో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో లేదా 87126 59714ను సంప్రదించాలని తెలిపారు.
జానకంపేటలో..
ఎడపల్లి: మండలంలోని జా నకంపేట శివారులోగల అశోక్ సాగర్ తూము వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలింది. జానకంపేట గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు గుంజ శ్రీనివాస్ మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 45నుంచి 50ఏళ్ల లోపు ఉంటుందన్నారు. అతడి వద్ద ఆధారాలు ఏవీ లభించలేవన్నారు. నీలం కలర్ లుంగీ, తెలుపు బనియన్ ధరించి ఉన్నాడని, ఎవరైనా గుర్తిస్తే 87126 59873 లేదా 87126 59780ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి