శివపల్లెలో కోడిపుంజులు
ఎలిగేడు: పందెంకోడి అ‘ధర’హో అనిపిస్తోంది. మేలుజాతి కోడిపుంజులకు భలేగిరాకీ ఉంటోంది. ఒకప్పుడు కోడిపందేలకు కేరాఫ్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామం ఇప్పుడు కోడి పుంజుల పెంపకానికి నిలయంగా మారింది. శివపల్లిలో పెద్దజాతి కోడిపుంజులు ఇంటింటా పెంచుతుండడంతో కొనుగోలు చేసేందుకు జిల్లాతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు.
దీంతో ఒకప్పుడు కోడి పందేలు నిర్వహించిన గ్రామానికి చెందిన వారు ఇప్పుడు మేలుజాతి కోడిపుంజులు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. మేలుజాతి కోడిపుంజు కిలోకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్నాయి. పెద్దవాటికి రూ.15వేల వరకు వెచ్చిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన కోడిపుంజులు మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాలకు తరలించి కోడిపందేలకు వినియోగిస్తారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment