రెస్క్యూను తయారు చేస్తూ..
క్రీడారంగంలో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి
● ఇతర సంస్థల సభ్యులకు శిక్షణ ఇస్తున్న సింగరేణి
● ఆదర్శంగా నిలుస్తున్న సంస్థ
● జాతీయ, అంతర్జాతీయ అనుభవంతో ముందుకు: జీఎం శ్రీనివాస్‌రెడ్డి
గోదావరిఖని:
కోలిండియా సంస్థలకు దీటుగా సింగరేణి పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీస్థాయిలో సత్తాచాటి రెస్క్యూ జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఏటా కొత్త సభ్యులకు శిక్షణ ఇస్తోంది. రెస్క్యూ బృందాలను తయారు చేస్తోంది. గతంలో కొన్నేళ్ల పాటు ఇతర సంస్థలకు శిక్షణ అందించిన సింగరేణి రెస్క్యూ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇతర జట్లకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా హిందూస్థాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్) సంస్థకు చెందిన సభ్యులకు శిక్షణ ఇస్తోంది. 14 మంది సభ్యులు గల బృందానికి శిక్షణ ప్రారంభించింది. 15 రోజుల పాటు కొనసాగే శిక్షణతో సంస్థ రూ.14 లక్షల మేర ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు ఇతర సంస్థలకు మేటిగా నిలువనుంది. కోలిండియా రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు అంటేనే ప్రత్యేక స్థానముంది. అలాగే సింగరేణి రెస్క్యూ ద్వారా శిక్షణ పొందిన సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింటి. ఈ క్రమంలో సింగరేణి రెస్క్యూ శిక్షణకు మంచి డిమాండ్ ఉంది. హిందూస్థాన్ జింక్ సంస్థకు చెందిన ఏడుగురు పురుషులు, మరో ఏడుగురు మహిళల బృందానికి సంస్థ శిక్షణ ఇస్తోంది. మిగితా సంస్థలకు కూడా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.
చాలా బాగుంది
మైన్స్‌రెస్క్యూలో వాతావరణం, శిక్షణ అన్ని రకాల బాగుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. రెస్క్యూ రికవరీ, బ్రీతింగ్ ఆపరేటర్స్, ఫస్ట్‌ఎయిడ్, డ్రిల్‌అండ్‌పరేడ్‌లో శిక్షణ కొనసాగుతోంది. ఆరునెలల క్రితమే సంస్థలో జాయిన్ అయ్యాను. రెస్క్యూ శిక్షణకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– జామృత్‌బాను, మైనింగ్ ఇంజినీర్, హెచ్‌జెడ్‌ఎల్
అన్ని వివరిస్తున్నారు..
ఇటీవలే హిందూస్థాన్ జింక్ సంస్థలో జాయిన్ అయ్యా. మహిళా రెస్క్యూ బ్రిగేడియర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. గత రెండు రోజుల నుండి శిక్షణ ఇస్తున్నారు. అన్ని అంశాలపై శిక్షణ కొనసాగుతోంది. ఈ శిక్షణతో మాలో మరింత ఆత్మస్థైర్యం పెరిగింది.
– అనీశా, సర్వీస్ ఇంజినీర్, హెచ్‌జెడ్‌ఎల్
క్లాసులు బాగున్నాయి
క్లాసులు చాలా బాగా చెబుతున్నారు. మూడు పూటలా మంచి ఆహారం అందిస్తున్నారు. భోజనం, వసతి సౌకర్యాలు బాగున్నాయి. రెస్క్యూలో శిక్షణ పొందడం ఇదే మొదటిసారి. అంతా షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. థియరీ, ప్రాక్టికల్ చాలా బాగా నేర్పిస్తున్నారు. – గంగవరపు థెరిస్సా డెీస్డీమోనా,
అసోసియేట్ మేనేజర్, హెచ్‌జెడ్‌ఎల్
అనేక సంస్థలకు శిక్షణ
జాతీయ, అంతర్జాతీయస్థా యి రెస్క్యూలో అనుభవం గడించాం. ఇప్పటికే అనేక సంస్థలకు శిక్షణ అందించాం. ఇక ముందూ మా వద్దకు వచ్చే స ంస్థల సభ్యులకు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తాం. 15 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుంది. సభ్యులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, రెస్క్యూ జీఎం, సింగరేణి
రెస్క్యూను తయారు చేస్తూ..
రెస్క్యూను తయారు చేస్తూ..
రెస్క్యూను తయారు చేస్తూ..
రెస్క్యూను తయారు చేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment