మంథని: మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ శివారు కాలువలో తిప్పని శంకరయ్య (80) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిసిన వివరాల ప్రకారం మంచిర్యాల ఏఎస్‌ఆర్ నగర్‌కు చెందిన శంకరయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రెండు, మూడురోజుల తర్వాత ఇంటికి వస్తాడు. 15రోజుల క్రితం మద్యం తాగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజులైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో సీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బుధవారం పోచమ్మ వాడ శివారులోని బిరుదు సతీశ్‌కు చెందిన పొలం పక్కనున్న కాలువ దగ్గరికి పని నిమిత్తం స్థానికులు వెళ్లి చూడగా అక్కడ గుర్తు తెలియని శవం కనిపించిందన్నారు. శంకరయ్య కుమారుడు తిప్పని లక్ష్మణ్ సంఘటనానికి వచ్చి శవాన్ని పరిశీలించి శరీరంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా తన తండ్రిగా గుర్తించినట్లు తెలిపారు. రెండు, మూడురోజుల క్రితమే ఎక్కడో కాలువలో పడి ఇక్కడికి కొట్టుకువచ్చి ఉంటాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment