పంటకు రక్షణగా..
ఉపాయం ఉండాలే కానీ ఎలాంటి అపాయం నుంచైనా తప్పించుకోవచ్చు అనేది నానుడికి సరిగ్గా
సరిపోతుంది ఈ రైతు ఐడియా. తాగి పారేసిన బీరుసీసాలను చెట్టుకు కట్టి పంట పొలాన్ని పక్షులు,
అడవి జంతువుల నుంచి రక్షించుకుంటున్నాడు. దారంతో ఖాళీ బీరుసీసాను వేలాడదీశాడు. అదే చెట్టుకు సీసా పక్కన మరో దారంతో రాయి లేదా ఇనుప మొలను కట్టడంతో గాలికి ఊగి బీరు సీసా మొలను తాకుతూ
టింగ్‌టింగ్ మని చప్పుడు చేస్తుండడంతో పక్షులు, మూగజీవాలు రాకుండా పంటను ఉపాయంతో
రక్షించుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా జాఫర్‌ఖాన్ పేట నుంచి బేగంపేట వెళ్లే దారిలో వరిపంట పొలాల్లో
గాజు సీసాల శబ్దాలు అదేపనిగా వస్తుండడంతో గమనించి ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
– ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment