‘ఎన్నికలు సజావుగా నిర్వహించటే’్ల
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడం లేదని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి రవీందర్‌సింగ్ ఆరోపించారు. బుధవారం కరీంనగర్‌లో న్యాయవాదులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. నామినేషన్ సమయంలో తమ వాహనాలను అడ్డగించి, మంత్రుల వాహనాలను లోపలికి అనుమతించిన వారిపై ఇంకా చర్యలు తీసుకోవడం లేదన్నారు. నరేందర్ రెడ్డి పేరు సీరియల్ నంబర్‌లో ముందుండాలని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మార్పు చేశారన్నారు. అధికారులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పట్టభద్రుల ఓటర్ల వివరాలను బహిర్గతం చేసే vnrm c.com అనధికార వెబ్‌సైట్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లంచం తీసుకొని, పని చేస్తున్న అధికారులు గాంధీభవన్‌లో కుర్చీ వేసుకొని, ఎన్నికలు జరపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికార వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు దేవకిషన్, మురళి, లింనాగరాజు, శరత్ చందర్‌రావు, వినయ్, రాజ్‌కుమార్, సందీప్, రమేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment