ఒత్తిడి జయిస్తే.. విజయమే
● పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు ప్రణాళికతో చదవాలి ● సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు ● మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలు
మార్చి.. విద్యార్థులకు పరీక్షా కాలం.. చదివిన చదువులకు ఫలితం కోసం శ్రమించే సమయం. మార్చిలో విద్యార్థులకు కీలకమైన ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. శోధించాలన్న తపనతో సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని అంటున్నారు. ఇటీవలి కాలంలో దీన్ని పలువురు రుజువు చేస్తూ పలు వార్షిక, పోటీ పరీక్షల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు. పరీక్షలంటే భయం వీడాలని, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి.. ఒత్తిడి జయిస్తే విజయం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. – సప్తగిరికాలనీ(కరీంనగర్)
– వివరాలు 8లోu
ఒత్తిడి జయిస్తే.. విజయమే
Comments
Please login to add a commentAdd a comment