వేసవిలో అంతరాయం లేని విద్యుత్ అందిస్తాం
హుజూరాబాద్: వేసవిలో అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జి డైరెక్టర్ సదర్‌లాల్ పేర్కొన్నారు. హుజూరా బాద్‌లో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ పనులను గు రువారం పరిశీలించారు. డివిజన్‌పరిధిలో వచ్చే మూడునెలల్లో విద్యుత్ డిమాండ్ గణనీ యంగా పెరిగే అవకాశం ఉందన్నారు. లోడ్ పెరిగే ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి కొత్తగా 45 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. 36 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచామన్నారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎల్బాకలో కొత్తగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. హుజూరాబాద్, అమ్మనగుర్తి, కోరపల్లిలో నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యామ్నాయ లైను ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా 5ఎన్‌ఎస్ ఇంటర్ లింకింగ్ లైన్ పనులు చేపట్టామని తెలిపారు. కరీంనగర్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, డీఈ లక్ష్మారెడ్డి, డీఈ కన్‌క్షన్ చంద్రమౌళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment