సైబర్ నేరానికి పాల్పడిన యువకుడి అరెస్ట్
మెట్‌పల్లి(కోరుట్ల): మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన మామిడాల నితీశ్‌కుమార్‌ను నమ్మించి రూ.6లక్షలు కాజేసిన షణ్ముఖ కృష్ణయాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం..ఉన్నత చదువుల కోసం నితీశ్‌కుమార్ లండన్ వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. కృష్ణయాదవ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా మెసేజ్ పంపి అతన్ని పరిచయం చేసుకున్నాడు. తాను లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని, ఇండియా డబ్బులతో ఫీజు కడితే ఎక్కువ ఖర్చు అవుతోందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తే, తాను లండన్ కరెన్సీతో ఫీజు చెల్లించి రశీదు పంపుతానని నమ్మబలికి అతడి ఖాతా వివరాలు పంపాడు. అనంతరం నితీశ్‌కుమార్ వెంటనే తన ఖాతా నుంచి రూ.25వేలు, తన తల్లి ఖాతా నుంచి రూ.5.75లక్షలను కృష్ణయాదవ్ ఖాతాలో జమ చేశాడు. తర్వాత కొన్ని రోజులకు రశీదు గురించి అడిగితే పంపకుండా సెల్‌ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. మోసపోయాయని గ్రహించిన నితీశ్‌కుమార్ మల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతేడాది మే లో కేసు నమోదు చేసి ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత లండన్‌న్ వెళ్లిన నితీశ్‌కుమార్, అక్కడ అతని గురించి వెతకగా ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన కృష్ణయాదవ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్సై రాజు అక్కడకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకొని మెట్‌పల్లికి తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ పేర్కొన్నారు.
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): అనారోగ్యం బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహ త్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై స్వామి కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల శంకర్(60) కొంతకాలంగా అ నారోగ్యంతో బాధపడుతున్నాడు. నెలక్రితం ఆ పరేషన్ కూడా చేయించుకున్నాడు. అయినా ఆ రోగ్యం కుదుటపడలేదు. దీంతో జీవితంపై వి రక్తి చెంది గురువారం అర్ధరాత్రి ఇంటి ఎదుట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
గూడెంలో పీజీ విద్యార్థి..
ఓదెల(పెద్దపల్లి): గూడెం గ్రామానికి చెందిన గూడ దామోదర్(30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. దామోదర్ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తిచెంది ఇంట్లోని పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
జూలపల్లి(పెద్దపల్లి): కుమ్మరికుంట గ్రామానికి చెందిన దోడ్ల లచ్చయ్య(58)బావిలో మునిగి మృతి చెందాడు. ఎస్సై సనత్‌కుమార్, మృతుడి భార్య కనుకమ్మ కథనం ప్రకారం.. శుక్ర వారం ఉదయం చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి న లచ్చయ్య.. బావిలో విద్యుత్ మోటారు పైపు సరిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. అయితే, బావిలో ఉన్న తీగె లు తట్టుకునిపైకి రాలేక నీళ్లలో మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
సైబర్ నేరానికి పాల్పడిన యువకుడి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment