24న కరీంనగర్‌కు సీఎం రేవంత్?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఈనెల 24న సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌కు రానున్నారని రానున్నారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా నగరంలోని ఎస్సారార్ కాలేజీలో సభ నిర్వహించనున్నారు. దీనికోసం కాంగ్రెస్ శ్రేణులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా తదితరులు పాల్గొంటున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 10న నామినేషన్ రోజున నరేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు, అనసూయ, సురేఖ, జూపల్లి హాజరైన విషయం తెలిసిందే. ప్రచారం 25వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీఎం సభతో ముగించాలని పార్టీ లీడర్లు భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment