టీచర్ సస్పెన్షన్
సిరిసిల్ల ఎడ్యుకేషన్: కోనరావుపేట మండలం నిజామాబాద్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న కె.బ్రహ్మంపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుతో అతనిపై పోక్సో కేసు నమోదైందని, ఫిబ్రవరి 24 నుంచి సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనం దగ్ధం
మంథని: భట్టుపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం సోమవా రం మంటల్లో దగ్ధమైంది. సోమన్‌పల్లికి చెందిన వాహనదారు.. మంథని నుంచి 20 లీటర్ల పెట్రోల్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. భట్టుపల్లి సమీపంలోకి వెళ్లగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనదారు ఆందోళన చెంది, బైక్‌ను పక్కకు పడవేశాడు. దీంతో పెట్రోల్ మంటల్లో బైక్ కాలిపోయింది. దారి వెంట వెళ్తున్న వాహనదారులు గమనించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ కాలిబూడిదైంది.
పోగొట్టుకున్న డబ్బులు అప్పగింత
● నిజాయితీ చాటుకున్న గుండి కార్యదర్శి
రామడుగు(చొప్పదండి): ఓ వ్యక్తి పోగొట్టుకున్న డబ్బులు దొరికితే తిరిగి అప్పగించి, తన నిజాయితీ చాటుకున్నాడు గుండి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన గంగు ఎల్లయ్య సోమవారం దేవతా విగ్రహాలను కొనుగోలు చేయడానికి రామడుగు వచ్చా డు. నడుస్తూ వెళ్తుంటే అతని వద్ద ఉన్న రూ. 50 వేలు కిందపడిపోయాయి. ఎల్లయ్య చూ సుకోకుండానే ముందుకు వెళ్లిపోయాడు. అదే సమయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి గుండి గ్రామానికి వెళ్తున్నాడు. రామడుగు నూతన వంతెన వద్ద రూ.50 వేలు కనిపించాయి. విషయాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆ డబ్బులను బాధితుడికి అప్పగించాలని సూ చించారు. దీంతో పోలీసులు గంగు ఎల్ల య్యను గుర్తించి, కరీంనగర్‌లో అడిషన్ డీసీపీ లక్ష్మీనారాయణ చేతులమీదుగా డబ్బులు అప్పగించారు. చొప్పదండి సీఐ ప్రకాశ్, రామడుగు ఎస్సై శేఖర్ ఉన్నారు.
పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఆభరణాలు చోరీ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గొల్లెం పెట్టిన ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మ ండలంలోని చిన్నరాతుపల్లికి చెందిన మద్దెల రాజేందర్ కుటుంబసభ్యులు సోమవారం ఇంటికి గొల్లెం పెట్టి, స్థానికంగా జరిగిన పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో చూడగా 9 తు లాల బంగారు, 8 తులాల వెండి ఆభరణా లు కనిపించలేదు. తమ వీధిలో జరిగిన పెళ్లికే వెళ్తున్నాం కదా అని తాళం వేయకుండా వెళ్లామని, చోరీ జరుగుతుందని అనుకోలేదని బాధితులు లబోదిబోమన్నారు. సు ల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీచర్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment