అన్నావదినపై గొడ్డలితో దాడి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని ఇప్పపెల్లిలో ఇంటి వివాదం కారణంగా ఓ వ్యక్తి తన అన్నావదినపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. పోలీసు ల కథనం ప్రకారం.. ఇప్పపెల్లికి చెందిన యాగండ్ల పెద్దరాజం, చిన్నరాజం సోదరులు. ఇంటి విషయ మై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో చిన్నరాజం కోపోద్రిక్తుడయ్యాడు. క్షణికావేశంలో అన్నపై గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అతని వదిన లక్ష్మి అడ్డు వెళ్లగా గొడ్డలి ఆమె వీపు భాగంలో రెండుసార్లు తగిలింది. ఈ సంఘటనలో లక్ష్మికి తీవ్ర, పెద్దరాజంకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇంటి వివాదమే కారణం
Comments
Please login to add a commentAdd a comment