‘మైనారిటీ గెజిటెడ్ ఆఫీసర్స్’ రాష్ట్ర అధ్యక్షుడిగా రియ
కరీంనగర్: తెలంగాణ మైనా రిటీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆసోసియెషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం హైదరాబా ద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, విశ్వేశ్వరయ్య భవన్ సమావేశ మందిరంలో జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎండీ.రియాజ్ అలీ (నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్)ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నీటిపారుదల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఎండీ.దస్తగీర్, అదనపు కార్యదర్శిగా ఎంఏ.అక్తర్ ఫారుఖీ, ఉపాధ్యక్షుడిగా ఇస్రాల్ ఉన్ని సా, సహాయ కార్యదర్శిగా రసూల్ ఇర్ఫాన్, కోశాధికారిగా ఎలియట్ రెబిల్సన్, మహిళా కార్యదర్శిగా రేష్మా తబస్సుమ్, కార్యనిర్వాహక సభ్యులుగా షా హిద్ అలీ తబరేజ్, కలీముద్దీన్, ఇలియాస్ అహ్మద్, అయూబ్‌ఖాన్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడు రియాజ్ అలీ మాట్లాడుతూ.. మైనారిటీ గెజిటెడ్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment