గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దపల్లిరూరల్: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని ఎస్సై లక్ష్మ ణ్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 1న పెద్దపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో అచేతనంగా పడివున్న గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడు నీలిరంగు ఫుల్ టీషర్ట్, ఆకుపచ్చ లుంగీ ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 87126 56506, 87126 56507 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఎస్సై సూచించారు.
టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం
ఇల్లంతకుంట(మానకొండూర్): ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన నక్క శంకరయ్య(49) మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా మైలారం గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో అనంతారం సమీపంలో అన్నపూర్ణ ప్రాజెక్టు కెనాల్ వద్ద టిప్పర్ ఢీకొట్టింది. రోడ్డుపై పడిన శంకరయ్య పైనుంచి టిప్పర్ టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం ముద్దలు ముద్దలుగా రోడ్డంతా పడింది. పోలీసులు పారలతో కుప్పగా చేసి, సంచిలో నింపి, ఆస్పతికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
మానకొండూర్: మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన కొమ్మగల్ల పవన్‌కల్యాణ్(22) ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. పవన్‌కల్యాణ్ సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఎదుట రేకుల షెడ్డులో నిద్రించాడు. 11 గంటల సమయంలో చలి వేస్తోందని, ఇంట్లో పడుకుంటానని చెప్పి, వెళ్లాడు. 1.20 గంటలకు ఇంట్లో నుంచి శబ్ధం వినిపించడంతో తల్లిదండ్రులు నిద్ర లేచారు. లోపలికి వెళ్లి చూడగా కుమారుడు పవన్‌కల్యాణ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని, కనిపించాడు. కాగా, మూడు రోజులుగా తమ కొడుకు జ్వరంతో బాధ పడుతున్నాడని, గ్రామంలోనే చికిత్స పొందినా తగ్గలేదన్నారు. దీంతో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
భార్యను తిట్టాడని వ్యక్తి హత్య
● నిందితుడి అరెస్టు
సిరిసిల్ల క్రైం: భార్యను తిట్టాడన్న కోపంతో వ్యక్తిని హత్య చేశాడో భర్త. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన రమేశ్, తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మధుసూదన్ కూలీలుగా పనిచేసే చోట పరిచయమయ్యారు. పలుమార్లు కలిసి మద్యం తాగేవారు. గత నెల 24న మద్యం సేవించారు. ఆ సమయంలో మధుసూదన్ తన భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని రమేశ్‌తో చెప్పాడు. దీంతో అతను.. అవును ఆమె మంచికాదంటూ తిట్టాడు. కోపోద్రిక్తుడైన మధుసూదన్ మద్యం మత్తులో ఉన్న రమేశ్‌ను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, బండరాయితో మోది చంపేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని మధుసూదన్‌గా గుర్తించి, మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment