సిరిసిల్ల కల్చరల్: నేరాలు చేసి, తప్పించుకోవడం సాధ్యం కాదని, చట్ట పరిధిలో శిక్షలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల్లో 22 కేసుల విచారణ జరిగి, నేరస్తులకు శిక్షలు పడ్డాయన్నారు. ఈ విషయంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మీప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ్, సందీప్, సతీశ్, విక్రాంత్, ఆయా స్టేషన్ల పోలీసులను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. నేరస్తులకు శిక్ష పడితే సమాజంలో నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేర నిర్ధారణలో సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జోడించాలని చెప్పారు. వేములవాడ పట్టణ పరిధిలో గంజాయికి సంబంధించిన కేసులో నేరస్తులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఎంఎస్ శ్రవణ్‌యాదవ్, రవీంద్రనాయుడు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
నేరస్తులకు శిక్షలు
రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
Comments
Please login to add a commentAdd a comment