అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కొత్తపల్లి(కరీంనగర్): అంతర్రాష్ట్ర దొంగతనాలకు పాల్పడే ముఠాలోని సభ్యుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ట్రైనీ ఐపీఎస్ వసుంధర యాదవ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా తండా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోర్ గ్రామానికి చెందిన ప్రదీప్(30) మరో 8 మంది ముఠాగా ఏర్పడ్డారు. ఏడాదికాలంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ట్రావెల్స్ బస్సుల ద్వారా నిజామాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కరీంనగర్‌కు చేరుకుని, కాలినడకన ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కీ నిర్వహిస్తుంటారు. దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్న సమీప ప్రాంతంలో మాటువేసి, అర్ధరాత్రి తర్వాత తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తించి, తాళాలను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతారు. ఈ చోరీలపై నిఘాపెట్టిన కరీంనగర్ రూరల్ ఏసీపీ, సీసీస్, కొత్తపల్లి పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ వెళ్లి ఈ నెల 3న ముఠాలోని ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగలగుంటపల్లి, గుంటూరుపల్లి, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్, చింతకుంటలో నాలుగు దొంగతనాలకు పాల్పడ్డారని వసుంధర వెల్లడించారు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై సాంబమూర్తి, కానిస్టేబు ళ్లు షరీఫ్, శ్రీనాథ్, ఖదీర్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం నగ్రాలేలను ట్రైనీ ఐపీఎస్ అధికారి వసుంధర యాదవ్ అభినందించారు. రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment