చొప్పదండి: మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ రాఘవాచారి (54) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ అనూష కథనం ప్రకారం.. రాఘవాచారి ఈ నెల 5న ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయించారు. ఆరోగ్యం మెరుగైందని ఇంటికి తీసుకురాగా ఇటీవల మళ్లీ క్షీణించింది. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. రూ.20 లక్షల వరకు అప్పు చేసి ఇంటి నిర్మాణం చేయగా, అప్పులు పెరిగి, తన వెల్డింగ్ షాపు సరిగా నడవకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య తార ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు.
విషజ్వరంతో మహిళ..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఆసియాబేగం (40) విషజ్వరంతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నాలుగురోజుల క్రితం ఆసియాబేగంకు జ్వరం రావడంతో జమ్మికుంటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి శనివారం కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డెంగీ లక్షణాలు కూడా కనిపించినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన జిలకర రామస్వామి కూడా విషజ్వరంతో చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయని, వైద్య శిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి