జాతీయపోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయపోటీలకు ఎంపిక

Published Thu, Mar 27 2025 12:25 AM | Last Updated on Thu, Mar 27 2025 12:23 AM

వెల్గటూర్‌: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన అరిగెల వైశాలి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 9న హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు కరీంనగర్‌ జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్‌, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఈ నెల 26 నుంచి 29వరకు యూపీలోని లక్నోలో జరిగే 47వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఎండపల్లి నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంపై మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, సాన యాదిరెడ్డి, ఎంఈవో రాంచంద్రం, వెంకటరమణారెడ్డి వైశాలిని అభినందించారు.

నాలుగు ఇళ్లలో చోరీ

మానకొండూర్‌: అన్నారం గ్రామంలో మంగళవారం రాత్రి నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి, ఓ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మానకొండూర్‌ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. గొట్టెముక్కుల విజయ ఇంట్లో నిద్రిస్తుండగా.. బంగారు పుస్తెల తాడు అపహరించారు. మధునాల వెంకటమ్మ ఇంట్లో 55 తులాల వెండి, రూ.20వేల నగదు, రుద్రోజు వెంకటాచారి ముప్పావు తులం బంగారం, 18 తులాల వెండి పట్టీలు, పాకాల రాజిరెడ్డి ఇంటి ఎదుట ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ, క్లూస్‌ టీం పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మిర్చి యార్డులో..

తిమ్మాపూర్‌: మండల కేంద్రంలోని మిర్చియార్డ్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేలు దొంగిలించారని యజమాని శ్రీనివాస్‌, అంజయ్య తెలిపారు. ఇద్దరు దొంగలు రాత్రివేళ చోరీకిపాల్పడినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. యజమాని శ్రీనివాస్‌, ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్‌ఎండీ ఎస్‌ఐ వివేక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం క్లూస్‌టీంకు సమాచారం అందించగా సీఐతో సిబ్బంది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఆధారాలను సేకరించి విచారణ చేపడతామని తెలిపారు.

లింగ నిర్ధారణ నేరం

కరీంనగర్‌టౌన్‌: పట్టణంలోని శ్రీలత మెటర్నిటీ నర్సింగ్‌హోమ్‌ ఆస్పత్రిలో అనధికారికంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మిషన్‌, గదిని డీఎంహెచ్‌వో వెంకటరమణ ఆధ్వర్యంలో సీజ్‌ చేశారు. బుధవారం అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, ఫెర్టిలిటీ కేంద్రాల స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా శ్రీలత మెటర్నటీ నర్సింగ్‌ హోం హాస్పిటల్‌ను రెవెన్యూ, పోలీస్‌ విభాగాలతో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మొబైల్‌ స్కానింగ్‌ మిషన్‌ను గుర్తించిన అధికారులు నోటీసు అందించి సీజ్‌ చేశారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ... అనుమతులు లేకుండా స్కానింగ్‌లు నిర్వహించడం, లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాములు, జూనియర్‌ అసిస్టెంట్‌ బాపు దేవ్‌, ఏఎస్సై విజయమణి, డాక్టర్‌ ఉమాశ్రీ, సనా జవేరియా, సఖి కన్సల్టెంట్‌ లక్ష్మి, కె.రమేశ్‌, రాజగోపాల్‌, సయ్యద్‌ సాబీర్‌ పాల్గొన్నారు.

వరకట్నం కేసు నమోదు

కథలాపూర్‌: కథలాపూర్‌ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన ఎల్ల మౌనికను అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్తతోపాటు అత్తింటివారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. తాండ్య్రాల గ్రామానికి చెందిన ఎల్ల మౌనికకు కోరుట్లకు చెందిన ఎల్ల నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. మౌనికను ఇటీవలే అదనంగా రూ.10లక్షల కట్నం తేవాలని నవీన్‌, అత్త లక్ష్మి, ఆడపడుచు జల వేధిస్తున్నారు. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎల్ల నవీన్‌, ఎల్ల లక్ష్మి, ఎల్ల జలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

జాతీయపోటీలకు ఎంపిక1
1/3

జాతీయపోటీలకు ఎంపిక

జాతీయపోటీలకు ఎంపిక2
2/3

జాతీయపోటీలకు ఎంపిక

జాతీయపోటీలకు ఎంపిక3
3/3

జాతీయపోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement