
రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి
● మంత్రి తుమ్మలను కలిసిన కవ్వంపల్లి
ఇల్లంతకుంట(మానకొండూర్): రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలని మా నకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం సచి వాలయంలో కలిసి విన్నవించారు.
కొడుకుకు కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి నిర్ణయం
మేడిపల్లి: భీమారం మండలం మన్నేగూడెంకు చెందిన మహేందర్‌కు కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి నిర్ణయించుకున్నాడు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాదపడుతున్న మహేందర్‌కు కిడ్నీ ఇచ్చేందుకు డోనర్ దొరకకపోవడంతో తన తండ్రి భూమయ్య కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో గ్రామస్తులు అభినందించారు. అయితే కిడ్నీ మార్పిడికి రూ.5లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిరుపేద కావడంతో మాజీ సర్పంచ్ తేలు నరేశ్ దృష్టికి విషయం తీసుకపోగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు విషయం తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు రూ.5లక్షలు ఎల్‌వోసీ మంజూరు చేయించి చికిత్సకు సహకరించారు.