
పోటీ పరీక్షల్లో రాణించాలి
చొప్పదండి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని, రానున్న ఎన్‌డీఏ రాత పరీక్షలో అర్హత సాధించాలని సంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. మండలంలోని రుక్మాపూర్ శివారు సైనిక శిక్షణ పాఠశాలలో ఆమె రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులంలో అమలు అవుతున్న శిక్షణ కార్యక్రమాలు, హాస్టల్ నిర్వహణ, పరిసరాలు, క్రీడలను పరిశీలించారు. బాక్సింగ్, ట్రెక్కింగ్ కార్యకలాపాలలో స్వయంగా విద్యార్థులతో పాటు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి సైనిక పాఠశాల నుంచి అత్యధికంగా 22 మంది కెడెట్లు ప్రవేశం పొందడం గర్వకారణమన్నారు. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, ఐటీ, ఇంజినీరింగ్ విభాగాలలో అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ సేవల్లో కూడా ప్రవేశం పొందాలని కోరారు. ఎల్లప్పుడు బ్యాకప్, ఆకస్మిక ప్రణాళిక ప్రత్యామ్నాయ ఎంపికలను కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి ఎం భీమయ్య, శర్మ, కిశోర్, డైరెక్టర్ కల్నల్ కేసీ రావు, ప్రిన్సిపాల్ జి.కాళహస్తి, తదితరులు పాల్గొన్నారు.