![మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/6/05blr08-120006_mr.jpg.webp?itok=kw_9Pmt4)
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్
గంగావతి: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు తమ ప్రభుత్వం కొన్ని నెలల్లోనే గ్యారెంటీ పథకాలను అమలు చేయడం వల్ల పేద ప్రజలకు కడుపు నిండా తిండి లభించి సుఖంగా జీవిస్తున్నారని కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్ పేర్కొన్నారు. ఆయన గురువారం పల్లె బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తన నియోజకవర్గంలో 103 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.260 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో ఈ పనులకు టెండర్ పిలుస్తామన్నారు. రోడ్ల నిర్మాణానికి అంచనాలు(ఎస్టిమేషన్) తయారు చేయాలని అధికారులను ఆదేశించానని, అంచనాలు తయారైన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అప్రూవల్ చేయించి రోడ్డు సరిగ్గా లేని ప్రతి గ్రామానికి తారు రోడ్లు వేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment