శిరాడి ఘాట్ రూపు మారేనా?
దొడ్డబళ్లాపురం: మంగళూరు–బెంగళూరు మధ్య ప్రధాన రహదారి అయిన శిరాడి ఘాట్ లో సొరంగ మార్గం, గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. 2022లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ పథకం అమలుకు భారీ గా నిధులు అవసరమవుతాయనే కారణంతో దీన్ని తిరస్కరించారు. అయితే సొరంగ మార్గం మార్గానికి అనుమతివ్వాలని దక్షిణ కన్నడ, హాసన్ జిల్లా ఎంపీలు, నేతలు పదే పదే డిమాండ్లు చేయడంతో నివేదిక తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఇది నిర్మాణం జరిగితే రెండు మహానగరాలతో పాటు అనేక ప్రాంతాల మధ్య సత్వర ప్రయాణం సాధ్యమవుతుంది. పర్యాటక పథకాలూ ఊపందుకుంటాయి.
అభ్యంతరాలు ఉన్నాయి
శిరాడి ఘాట్ పూర్తిగా అడవులలో ఉంటుంది. ఈ పథకాన్ని అమలు చేయరాదని పరిసర సంరక్షకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ రహదారి–75 మార్గంలో 26 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రహదారి, 3.8కి లోమీటర్లు టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంది. కొన్ని చోట్ల ఫ్లై ఓవర్‌లు నిర్మించాలి. ఈ ఖర్చులు అన్నీ కేంద్రం భరించాల్సి ఉంది. భూస్వాధీనం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రోడ్డు విస్తరణకు లక్షల్లో చెట్లు తొలగించాల్సి ఉంది. వన్యజీవులకు ఆటంకం కలుగుతుంది. అందువల్ల సొరంగ మార్గం మంచిదని పర్యావరణవాదులు, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. చెట్లు నరికేస్తే కొండచరియలు ఎక్కడికక్కడ విరిగిపడే ప్రమాదాలు పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో పథకం భవితవ్యం డోలాయమానంలో పడింది.
గ్రీన్ ఫీల్డ్ రహదారి, సొరంగ మార్గం
నిర్మాణానికి నివేదిక తయారీ
పర్యావరణవాదుల వ్యతిరేకత
శిరాడి ఘాట్ రూపు మారేనా?
Comments
Please login to add a commentAdd a comment