సొమ్ము నీది, జాతర వారిది
హుబ్లీ: ఇప్పుడు కన్నడనాట సీఎం కుర్చీ మారుతుందా, లేదా? అన్నదే ముఖ్య చర్చ అయి కూర్చుంది. ఆఖరికి ఆధ్యాత్మికులు కూడా దీనిపైనే జోస్యాలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఇదే హయాలో ముఖ్యమంత్రి అవుతారని సాధ్వి భైరవి అమ్మ జోస్యం చెప్పారు. గురువారం హుబ్లీలో సిద్ధారూఢ మఠ జాతరలో పాల్గొన్న అమ్మ మీడియాతో మాట్లాడారు. నా మాటలు ఎప్పటికీ అబద్ధాలు కావు. నేడు మూడేళ్ల క్రితం శివకుమార్ ఇంటికి వెళ్లాను ,ఆయన నన్ను పిలిచారు, మునుముందు ఏం జరుగుతుందో అని అడిగారు. ఏం కావాలని కోరుకుంటున్నారని అడిగాను. ముందు కథ ఏమిటని ఆయన అడిగారు. ఎవరిదో డబ్బులు, యల్లమ్మ జాతర అని బదులిచ్చాను. నీవు సంపాదించే డబ్బులు మరెవ్వరో తిని బలపడుతారని దాని అర్థం అన్నాను. ఇది జరిగింది నిజమే కదా.. అని అమ్మ ప్రశ్నించారు. నేను వినయ్ కులకర్ణి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అవుతావని చెప్పాను వినయ్ ఎమ్మెల్యే అయ్యారు కదా, నా మాటలు ఎప్పటికి అబద్ధాలు కావు. సీఎం పదవిలో శివకుమారే కూర్చుంటారు. నాకు ఆయన మీద కానీ, సీఎం సిద్దరామయ్య పై కానీ బీజేపీ పై కానీ ఎటువంటి అభిమానం లేదన్నారు. కాగా, అమ్మ మాటలు అంతటా చర్చనీయాంశమయ్యాయి.
ఎవరీ సాధ్వి?
భైరవి అమ్మా ఉడుపిలో పుట్టారు. వారి మూలం దావణగెరెలో ఉంది. అసలు పేరు విద్యాభారతి. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి స్కూల్ ఉపాధ్యాయిని. విద్యాభారతి అఘోరీలతో కలిసి హిమాలయాలకు వెళ్లారు. ఓ సన్యాస మఠం అధ్యక్షురాలిగా ఉన్నారు. సంఖ్యాశాస్త్రం, జోతిష్యంలో ప్రావీణ్యం ఉందని పేరుంది.
మాట్లాడుతున్న సాధ్వి భైరవి అమ్మ
డిప్యూటీ సీఎం డీకేపై సాధ్వి
భైరవి వ్యాఖ్యలు
ఈ దఫాలోనే సీఎం అవుతారని జోస్యం
Comments
Please login to add a commentAdd a comment