పద పద.. పడవలో
స్పీడ్ బోటింగ్ దృశ్యం
హొసపేటె: హంపీ ఉత్సవాలలో భాగంగా సమీపంలోని కమలాపుర చెరువులో పడవ విహారం ఆకట్టుకుంటోంది. మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ గురువారం బోటింగ్‌ను ప్రారంభించారు. బోటులో విహరిస్తూ సరస్సు అందాలను తిలకించారు. ఉత్సవాలకు వచ్చే పర్యాటకులకు 3 రోజుల పాటు పడవ ప్రయాణం అందుబాటులో ఉంటుంది. సరస్సు నీళ్లలో పడవలు, వాటర్ స్కూటర్ రయ్‌మని దూసుకెళ్తుంటే చూడడానికి హుషారుగా ఉంటోంది. ఈ అందమైన సరస్సు చుట్టూ పరచుకున్న కొండలు, పచ్చని లోయల ప్రకృతి సౌందర్యం ఆకట్టుకుంటుంది. పర్యాటకులు బోటింగ్‌లో అపురూపమైన అనుభూతిని పొందుతారు.
రూ.100, 300 టికెట్లు
మురుడేశ్వరం, గోకర్ణలో జల క్రీడలు నిర్వహించే సంస్థ ఇక్కడ బోటింగ్‌ను నిర్వహిస్తోంది. 15 మంది సిబ్బంది వచ్చారు. 8 సీట్లతో కూడిన 2 స్పీడ్ బోట్లు, 6 సీట్ల స్పీడ్ బోట్ ఒకటి, 1 వాటర్ స్కూటర్ అందుబాటులో ఉంటాయి. బోటింగ్‌కు ఒకరికి టికెట్ ధర రూ.100, స్కూటర్‌కు రూ.300 అని తెలిపారు.
కమలాపుర చెరువులో విహారం
హంపీ ఉత్సవాల సందడి
Comments
Please login to add a commentAdd a comment