నకిలీ సర్టిఫికెట్ల ముఠా సూత్రధారి అరెస్ట్
రాయచూరు రూరల్: నకిలీ సర్టిఫికెట్లతో ఆరోగ్య శాఖలో 14 మంది డీ గ్రూపు ఉద్యోగాలు పొందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అక్రమార్కులు 2015లో యాదగిరి జిల్లా శహాపుర తాలూకాలోని సగర, దోరేనహళ్లి, వనదుర్గ, సురపుర, హేమనూరల్లోని ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఆరోగ్య శాఖాధికారి చర్యలు చేపట్టి 14 మందిపై కేసు నమోదు చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన అంశంపై విచారణ చేపట్టిన లోకాయుక్త అధికారులు కలబుర్గి విశ్వవిద్యాలయంలో తనిఖీలను ముమ్మరం చేశారు. లోకాయుక్త ఎస్పీ ఉమేష్, డీఎస్పీ గీతా, హన్మంతరావ్, సీఐలు సంతోష్, అరుణ్ కుమార్, సిద్దరామ, రాజశేఖర్ విచారణ జరిపారు. దేశంలోని 28 విశ్వవిద్యాలయాల నుంచి నకిలీ మార్కుల సర్టిఫికెట్లను విక్రయించే ముఠాలో న్యూఢిల్లీకి చెందిన ప్రధాన నిందితుడు రాజీవ్ సింగ్‌ను అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ శరణప్ప వెల్లడించారు. బెంగళూరు, మైసూరు, ఆగ్రా, కురుక్షేత్ర, ఫిరోజాబాద్, బిలాస్‌పూర్, భూపాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లతో పాటు వివిధ ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి 522 నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 36 మొబైల్ ఫోన్లు, 122 నకిలీ సీల్ ముద్రలు, 87 బ్యాంక్ ఖాతాలు, రూ.లక్షా 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కలబుర్గిలో లోకాయుక్త అధికారుల పరిశీలన
నకిలీ సర్టిఫికెట్ల ముఠా సూత్రధారి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment