బొమ్మనహళ్లి : ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈఘటన బెంగళూరు నగరం బొమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాడమ్మ లేఔట్‌లో జరిగింది. ఇక్కడ శ్రీకంఠ (36), నాగేంద్ర అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. వీరి మధ్య ఆస్తి వివాదం ఉంది. శుక్రవారం మరోసారి గొడవ జరిగింది. ఓ దశలో నాగేంద్ర చాకుతో అన్న శ్రీకంఠపై దాడి చేశాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చె ందాడు. బొమ్మనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు నాగేంద్ర కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment