క్రమశిక్షణే ఉన్నతికి సోపానం
బనశంకరి: జీవితంలో క్రమశిక్షణతో చదివితే మీరు సీవీ రామన్, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాకేశ్‌శర్మల స్థాయికి ఎదగవచ్చని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ విద్యార్థులకు హితవు పలికారు. నరంలోని నెహ్రు ప్లానిటోరియంలో నూతనంగా నిర్మించిన ప్రొఫెసర్ యూఆర్.రావ్ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ మీరందరూ అనేక మంది శాస్త్రవేత్తలను చూశారన్నారు. మీరు ఎవరికన్నా తక్కువ కాదని అన్నారు. మీరు వీరి స్థాయికి ఎదగవచ్చన్నారు. మీరు విజయం సాధించాలంటే లక్ష్యం ఉండాలన్నారు. కల నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నారు. క్రమశిక్షణతో కష్టపడి చదివితే తమ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమన్నారు. శాస్త్రవేత్తలు మీ తరహాలో పుట్టి పెరిగివారేనన్నారు. మీకు ఉండే అవకాశాలు, సౌకర్యాలు వారికి లేవు కానీ వారు తమ లక్ష్యాన్ని చేరుకున్నారన్నారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ యూటీ.ఖాదర్, పరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి, మంత్రులు బోసురాజు, కృష్ణబైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఎంసీ.సుధాకర్, బేస్ సంస్థ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ఎమ్మెల్యేలు రిజ్వాన్ హర్షద్, సలీం అహ్మద్, పాలికె పాలనాధికారి ఉమాశంకర్, ఐటీబీటీ కార్యదర్శి ఏక్‌రూప్ కౌర్, బీబీఎంపీ కమిషనర్ తుషార్‌గిరినాధ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment