గవర్నర్‌ను నిలబెట్టి అవమానిస్తారా?
శివాజీనగర: శాసనసభా ఉభయ సభల సమావేశంలో తొలి రోజునే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్‌కు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. శాసనసభకు గవర్నర్ విధానసభ తూర్పు ద్వారం నుంచి లోపలికి వచ్చారు. సీఎం సిద్దరామయ్య మోకాళ్ల నొప్పుల వల్ల మెట్లు ఎక్కలేక చక్రాల కుర్చీలో అసెంబ్లీకి వచ్చారు, దీంతో కొంతసేపు ఆలస్యం కావటంతో గవర్నర్, సీఎం రాకకోసం అసెంబ్లీలో కొన్ని నిమిషాలు నిలబడే ఉన్నారు. ఇది బీజేపీ సభ్యుల కోపానికి కారణమైంది. బీజేపీ సభ్యులు చన్నబసప్ప, గురురాజ్‌లు గవర్నర్‌ను అవమానం చేస్తున్నారా అని కేకలు వేశారు. మంత్రి బోసురాజు, కాంగ్రెస్‌కు చెందిన బసవరాజ రాయరెడ్డిలు మీకు మానవత్వం లేదా, అన్నిటిలో రాజకీయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొని సభలో గందరగోళం మొదలైంది. ఈ దశలో సిద్దరామయ్య సభకు చేరుకుని గవర్నర్‌ను స్వాగతించారు. అయినా మాటల యుద్దం జరిగింది. గవర్నర్ సభాపతి స్థానానికి వెళుతుండగా పోలీస్ బ్యాండ్‌వారు జాతీయ గీతం వాయించగా గొడవ సద్దుమణిగింది. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ సభ్యులు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు.
వర్సిటీల మూసివేతపై ఫిర్యాదు
బనశంకరి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 9 యూనివర్శిటీలను మూసివేసేలా అశాసీ్త్రయ, అప్రజాస్వామ్య నిర్ణయాలను తీసుకుంది, దీనివల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయి అని గవర్నర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రం లేదా దేశం అభివృద్ధికి పునాది ఉన్నత విద్యా వ్యవస్థ. బీజేపీ పార్టీ 2019–20లో అధికార అవధిలో రాష్ట్రవ్యాప్తంగా 10 నూతన యూనివర్శిటీలను ఏర్పాటుచేసింది. వేలాదిమంది విద్యార్థులు యూనివర్శిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇలాంటి సమయంలో సిద్దరామయ్య ప్రభుత్వం 9 యూనివర్శిటీలను అశాసీ్త్రయంగా మూసివేసే కుట్రకు పాల్పడటం తగదని అన్నారు. ఆ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గవర్నర్‌ను కోరారు.
సర్కారుపై ప్రతిపక్షాల ఆగ్రహం
సభకు సీఎం రాక ఆలస్యంతో వివాదం
ప్రముఖులకు సంతాపం
శివాజీనగర: ఇటీవల దివంగతులైన ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులకు అసెంబ్లీలో నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఎంపీ ఎం.శ్రీనివాస్, జయవాణి మంచేగౌడ, శ్యామ్ బెనగల్, సాహితీవేత్త డిసోజ, జానపద గాయకురాలు సుక్రి బొమ్మగౌడ తదితరుల సేవలను గుర్తుచేసుకున్నారు. మన్మోహన్‌సింగ్ బాల్యం నుంచి మరణం వరకు ప్రముఖ ఘట్టాలను పలువురు సభ్యులు వివరించారు. వారి గౌరవార్థం సభ్యులు నిమిషం పాటు లేచి నిలబడి మౌనం పాటించారు.
గవర్నర్‌ను నిలబెట్టి అవమానిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment