పచ్చిమాంసం తినరాదు
● బర్డ్‌ఫ్లూ మార్గదర్శకాలు
బనశంకరి: రాష్ట్రంలో కోళ్లలో బర్డ్ ప్లూ జబ్బు బయటపడడంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. ఎలాంటి పచ్చిమాంసం తినరాదు, మాంసాన్ని బాగా ఉడికించి ఆరగించాలి. బర్డ్‌ప్లూ కనబడిన ప్రదేశాల్లో మాంసం అమ్మరాదు. అక్కడికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఎవరూ సంచరించరాదు. ఎవరికై నా బర్డ్ ప్లూ జ్వరం వస్తే పది కిలోమీటర్ల పరిధిలో నిఘా వేయాలి. పారిశుధ్య, నివారణ చర్యలను ముమ్మరం చేయాలి. ప్రజలెవరూ ఆ ప్రాంతంలో సంచరించరాదు అని నిషేధాజ్ఞల్లో హెచ్చరించారు.
బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
యశవంతపుర: మంగళూరులో కాంగ్రెస్ నాయకుని దాడి చేశారంటూ అక్కడి బీజేపీ
ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్‌తో పాటు 11 మంది కార్యకర్తలపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకుడు యశవంత్ ప్రభు ఆదివారం రాత్రి తనపై వారు దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే వేదవ్యాస్ రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని తెలిపాడు.
కన్యాథాన్ పరుగు
బొమ్మనహళ్లి: బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా మహిళా భద్రత కోసం కన్యాథాన్ పేరిట పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలో పరుగు సాగింది. సుమారు 10 కిలోమీటర్ల పరుగులో చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ పాల్గొన్నారు. ఎక్కువ మంది మహిళలు హాజరయ్యారు.
ఇంటిలో బంగారం చోరీ
మైసూరు: ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి బీరువాను బద్ధలు కొట్టారు. సుమారు రూ. 1.46 లక్షల విలువైన 73 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. మైసూరులోని రాజీవ్‌నగరలో నివాసం ఉంటున్న నాగేష్ బాబు అనే వ్యక్తి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో తల్లి ఒక్కరే ఉంటారు. ఆమె ఇటీవల బెంగళూరులో కుమారుని వద్దకెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి రాగా, ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి ఉన్నాయి. బంగారు నగలు కనిపించలేదు. వెంటనే ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళా ఐపీఎస్‌ల రగడ.. వర్తిక బదిలీ
బనశంకరి: రాష్ట్ర అంతరిక భద్రతా విబాగ (ఐఎస్‌డీ) ఐజీపీ డీ.రూపా మౌద్గిల్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసిన డీఐజీ వర్తికా కటియార్‌ను ఐఎస్‌డీ నుంచి సివిల్ డిఫెన్స్ విభాగానికి సోమవారం ప్రభుత్వం బదిలీ చేసింది. రూపా సిబ్బందిని తన గదిలోకి పంపి కొన్ని రికార్డులను పెట్టిందని వర్తిక ఆదివారం ఆరోపించడంతో మహిళా ఐపీఎస్‌ల యుద్ధం బయటకు పొక్కింది. పోలీసు అధికారులు ఆ సిబ్బందిని విచారించగా ఐజీపీ డీ.రూపా ఆదేశాల ప్రకారం ఫైళ్లను గదిలో పెట్టామని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వర్తిక బదిలీ అయ్యారు.
ఆన్‌లైన్‌లో
రూ.7.79 లక్షలు టోపీ
మైసూరు: మైసూరు నగరంలో సైబర్ నేరాలు తగ్గడం లేదు. తరచూ ఎవరో ఒకరు మోసపోతున్నారు. షేరు మార్కెట్‌లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఒకరి నుంచి రూ. 7.79 లక్షలను మోసగించారు. బాధితుని వాట్సాప్‌కు షేర్లలో లాభాలంటూ మెసేజ్ రావడంతో వారిని సంప్రదించాడు. దుండగులు మాయమాటలతో నమ్మించారు. దీంతో బాధితుడు విడతలవారీగా సుమారు 7.79 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. లాభం విత్ డ్రా చేసుకుందామని ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో కాల్ చేయగా అవతలి వైపు జవాబు రాలేదు. మోసపోయానని గమనించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పచ్చిమాంసం తినరాదు
పచ్చిమాంసం తినరాదు
Comments
Please login to add a commentAdd a comment