నటి రశ్మికకు బుద్ధి చెప్పాలి
దొడ్డబళ్లాపురం: ప్రముఖ నటి రశ్మిక మందన్నపై కన్నడ నేతలు గరం గరం అవుతున్నారు. ఆమెకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గాణిగ అన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. నటి రశ్మిక మందన్న కన్నడ చిత్రరంగం ద్వారా పరిచయమై అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కన్నడనాటను మర్చిపోయిందన్నారు. గత ఏడాది చిత్రోత్సవానికి ఆహ్వానిస్తే తాను హైదరాబాద్‌లో బిజీగా ఉన్నానని, రాలేనని తెగేసి చెప్పిందని అన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నడ చిత్రరంగానికి నట్లు, బోల్టులు టైట్ చేస్తానని అనడంలో తప్పు లేదన్నారు. సినిమావారు నోరు మూసుకుని ఉంటే మంచిదని లేదంటే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించడం గమనార్హం. కన్నడ సినిమాలకు ఇస్తున్న రాయితీలపై మరోసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఇదే నా లాస్ట్ వార్నింగ్, కన్నడ సినిమా వాళ్లు నోరు మూసుకుని ఉండాలి అని హెచ్చరించారు.
ఎమ్మెల్యే రవి గాణిగ ధ్వజం
సినీరంగంపైనా ఆగ్రహం
నటి రశ్మికకు బుద్ధి చెప్పాలి
Comments
Please login to add a commentAdd a comment