సీఐఎస్‌ఎఫ్ అధికారిణి మోసం చేసిందని..
యశవంతపుర: సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి పెళ్లి పేరుతో మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావిలో జరిగింది. సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసి ప్రాణాలు తీసుకున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిషేక్ సింగ్ (40). బెళగావిలో సీఐఎస్‌ఎఫ్‌లో సహాయక కమాండెంట్‌గా పని చేస్తున్న మోనిక సింగ్ కారణమని వీడియోలో ఆరోపించాడు. తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పోస్టు చేశాడు. మోనిక సింగ్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమలోకి దింపి, లైంగిక సంబంధం పెట్టుకుంది.
మానసికంగా హింసిస్తోంది
ఆమెకు వివాహమైనా కూడా ఆ సంగతి దాచి, నాతో సంబంధం కొనసాగించింది. పెళ్లి చేసుకుందామని అడిగితే బెదిరించి మానసికంగా హింసిస్తోందని వీడియోలో చెప్పాడు. చైన్నెలో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న అభిషేక్‌సింగ్ కొద్ది రోజుల క్రితం మంగళూరులో జరుగుతున్న వస్తు ప్రదర్శన చూడడానికి వచ్చాడు. బెళగావిలోని రావ్ సర్కిల్‌లో ఒక లాడ్జ్‌లో ఉన్నాడు. మోనికను కలిసి మాట్లాడిన తరువాత విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. బెళగావి నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇన్‌స్టాలో పోస్టు చేసి ప్రియుడు ఆత్మహత్య
బెళగావిలో సంఘటన
Comments
Please login to add a commentAdd a comment