వీడియో కాల్.. ఖాతా ఢమాల్
బనశంకరి: క్రెడిట్ కార్డు ఇస్తామని, లేదా బ్యాంక్ అధికారినంటూ వీడియో కాల్‌చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుని దోచేసిన సంఘటన నగరంలో జరిగింది. బెంగళూరు సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. నాగరబావి సమీపంలోని కళ్యాణనగర హేమంత్‌కుమార్ ఇలాంటి కేసులో లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. బాధితుడు గత నెల 24 తేదీన పొరపాటున వేరే అకౌంట్ కు నగదు పంపించాడు. దీని పరిష్కారం కోసం గూగుల్‌లో బ్యాంక్ సహాయవాణి నంబర్ గాలించి ఓ నంబరుకు ఫోన్ చేశాడు. ఫోన్ స్వీకరించిన వ్యక్తి సహాయం చేస్తామని హేమంత్‌కుమార్‌కు ఓ లింక్ పంపించి డౌన్‌లోడ్ చేసుకుని బ్యాంకు ఖాతా వివరాలు తెలిపాలని చెప్పాడు. హేమంత్ సరేనని వివరాలు నమోదు చేశాడు. కొంతసేపటి తరువాత వీడియో కాల్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. మీ డెబిట్‌కార్డు చూపించాలని అడగగా సరేనని చూపించాడు. బాధితుని ఖాతాకు రూపాయి పంపించి వచ్చిందా, లేదా అని అడిగారు. వచ్చిందని చెప్పగానే హేమంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.10.53 లక్షలను దుండగులు బదిలీ చేసుకున్నారు. గమనించిన హేమంత్‌కుమార్ ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. మోసపోయినట్లు తెలుసుకుని సెంట్రల్ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఒకరికి రూ. 10 లక్షలు, మరొకరికి
రూ. 85 వేలు మస్కా
బెంగళూరులో సైబర్ వంచనలు
బ్యాంకు సిబ్బంది పేరుతో మోసాలు
క్రెడిట్‌కార్డు నెపంతో రూ.85 వేలు
ఐటీ సిటీలో ప్యాలెస్ గుట్టహళ్లిలోని కస్తూరిబాయినగరవాసి టీకే ప్రవీణ్‌కుమార్‌కు క్రెడిట్ కార్డు ఇస్తామని మోసగించారు. జనవరి 31వ తేదీన ఫోన్ చేసిన ఓ వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారి అని చెప్పుకున్నాడు. మరిన్ని ఆఫర్లతో క్రెడిట్‌కార్డు ఇస్తామని, ఇప్పటికే వాడుతున్న క్రెడిట్‌కార్డు ఫోటో పంపిస్తే ఆన్‌లైన్‌లో నేరుగా ఇంటికి పంపిస్తామని తెలిపారు. నమ్మిన అతడు తన క్రెడిట్‌కార్డును వీడియో కాల్‌లో చూపించాడు. అంతే వివరాలు తెలుసుకున్న మోసగాళ్లు అతని క్రెడిట్ కార్డు ద్వారా రూ.85 వేలు జమచేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్ సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
వీడియో కాల్.. ఖాతా ఢమాల్
Comments
Please login to add a commentAdd a comment