దొడ్డబళ్లాపురం: దొంగలు, దొంగ సొత్తును కొంటున్న నలుగురిని అరెస్టు చేసిన బెంగళూరు తలఘట్టపుర పోలీసులు వారి నుంచి మొత్తం రూ.50 లక్షల విలువ చేసే వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలాజీ లేఔట్‌లో ఒక ఇంట్లో 700 గ్రాముల బంగారు వజ్రాభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. పోలీసులు సుబ్రమణ్యపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హనుమగిరికొండ వద్ద దొంగను ఆభరణాలతోపాటు పట్టుకున్నారు.
మరొకరితో కలిసి చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు. గిరినగర పీఎస్ పరిధిలో ఒక బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు చెప్పాడు. వీరు కొట్టుకొచ్చిన నగలను కొనే వ్యాపారిని, మధ్య దళారీని కూడా గాలించి పట్టుకున్నారు. వారి నుంచి కొంత మొత్తంలో బంగారు ఆభరణాలు రికవరీ చేశారు.
మరో కేసులో ఓ దొంగ..
తాళం వేసిన ఇళ్లను పగలు గుర్తించి రాత్రి వేళ చొరబడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
రూ.50 లక్షల సొత్తు సీజ్