
పనుల కేటాయింపులో పీడీఓ పక్షపాతం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మస్కి తాలూకా తోరణ దిన్ని పంచాయతీ పీడీఓపై చర్యలు చేపట్టాలని ఆ పంచాయతీ మాజీ అధ్యక్షురాలు చంద్రమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడారు. నవంబర్‌లో గ్రామ పంచాయతీ సభలో తీసుకున్న నిర్ణయం మేరకు వార్డుల్లో పనుల చేపట్టడానికి రూ.35 లక్షలు మంజూరు కాగా పీడీఓ తిమ్మప్ప నాయక్ పంచాయతీ అధ్యక్షుడితో కుమ్మకై ్క పనులు కేటాయించడంలో పక్షపాతం చూపుతున్నారని ఆమె ఆరోపించారు. కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలని పీడీఓ హుకుం జారీ చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టెన్త్ పరీక్షలకు
463 మంది గైర్హాజరు
హొసపేటె: ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు శనివారం కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 71 పరీక్షా కేంద్రాలు ఉండగా 20246 మంది విద్యార్థులు హాజరైనట్లు, 463 మంది గైర్హాజరైనట్లు డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని 12 కేంద్రాల్లో 3012 మంది హాజరు కాగా, 53 మంది గైర్హాజరయ్యారన్నారు. హోస్పేటలోని 20 కేంద్రాలకు 5658 మంది హాజరు కాగా, 140 మంది గైర్హాజరయ్యారన్నారు. 9 కేంద్రాల్లో జరిగిన ఫ్లవర్ బోట్ పరీక్షకు 2757 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారన్నారు. కూడ్లిగిలోని 17 కేంద్రాల్లో 4811 మంది హాజరు కాగా, 122 మంది గైర్హాజరయ్యారన్నారు. హరపనహళ్లిలో 13 కేంద్రాల్లో4008 మంది హాజరు కాగా, 115 మంది గైర్హాజరయ్యారన్నారు.